ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 26 (ప్రజాబలం) ఖమ్మం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న లోకసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు పనులను ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి. కోల్టే, పోలీస్ పరిశీలకులు చరణ్ జిత్ సింగ్ లు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఖమ్మం లోకసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూంల ఏర్పాట్లు కళాశాలలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసే గదులను పరిశీలించి, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ, పలు సూచనలు చేశారు. లెక్కింపు టేబుళ్ల కూర్పు, అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్ల ప్రవేశం, ఇవిఎం ల కదలికలపై సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. సీసీ కెమెరాలు, లైటింగ్, బ్యారికేడ్లు, పార్కింగ్, మీడియా సెంటర్ అన్ని వసతులు కల్పించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కు చేపట్టిన చర్యలు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ లలో ఇవిఎం ల భద్రతకు ర్యాక్ లను పరిశీలించి, ఆయా సెగ్మెంట్ల ఇవిఎం లు పట్టేంత సంఖ్యలో ఏర్పాటుచేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక్కో సెగ్నెంట కు ఒక్కో కలర్ కోడ్ పెట్టి, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన ఫ్లెక్సీలు, ఇవిఎం రవాణా సిబ్బంది టీ షర్టులు అదే కలర్ లో ఉండి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జనరేటర్ సదుపాయం ఉండాలని, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు. లెక్కింపు ప్రక్రియ, భద్రతా చర్యల గురించి సూచనలు చేశారు. ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి పరిశీలకులకు వివరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, శిక్షణ ఐపీఎస్ పి. మౌనిక, జిల్లా రెవిన్యూ అధికారిణి రాజేశ్వరి, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, ఎస్ఇ ఆర్ అండ్ బి శ్యామ్ ప్రసాద్, ఎస్ఇ ట్రాన్స్కో సురేందర్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల అధికారిణి శ్రీలత, అధికారులు, తదితరులు ఉన్నారు.
