సమస్యలకు పరిష్కారం కనుగొనడమే ఒన్నోవేషన్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : ప్రకృతిలోనే అనేక ఆవిష్కరణను ఉంటాయని,మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం ఇన్నోవేషన్ అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్ వేసే శిబిరానికి జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం 15 రోజుల పాటు నిర్వహించడం జరిగిందని. విద్యార్థులు విద్యార్థులు దశలో ఉండే ఆవిష్కరణ పై ముక్కు తెచ్చుకోవాలని తెలిపారు. ఆదిమానవుడి నుండి ఆధునిక మానవుని వరకు మానవులు ఎదుర్కొన్న సమస్యలను ఆవిష్కరణ ద్వారా పరిష్కరించడం జరిగిందని,‌ అంశం చిన్నదైనా,పెద్దదైనా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు.వేసవి శిబిరం నుండి వెళ్లేటప్పుడు పుస్తకాలలో నేర్చుకున్న సిద్ధాంత పరమైన విషయాలను ఇక్కడ నేర్చుకునే ప్రయోగాత్మక విషయాలను కలిపి అనుభవించుకొని విషయ అవగాహన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఉపయోగపడే కృత్యాలు చేయడం ద్వారా వాటిని నిజ జీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణంగా ఎదగాలని,శిబిరం నిర్వహణ కు అవసరమైన మనలను అందించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా సైన్స్ కేంద్రం ద్వారా విద్యార్థులకు విజయాన్ని అందించేందుకు కృషి చేస్తుందని, భవిష్యత్తు లో జిల్లా సైన్స్ కేంద్రానికి అనుసంధంగా జిల్లా సైన్స్ మ్యూజియం,పార్క్ వంటివి ఏర్పాటుకు ప్రయత్నాలు చేసి ఇంకా సైన్స్ విద్యార్థులకు మరింత చెరువ చూసేందుకు చర్యలు తీసుకోమంటావని తెలిపారు.వేసవి కాలంలో తగు జాగ్రత్తలు వహిస్తూ విద్యార్థులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రయోగాత్మకంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అన్నారు. పనిని ఇష్టంగా చేయడం ఆదిమానవునికి లక్షణం అయితే స్మార్ట్ వర్క్ చేయడం నాగరిక మానవుని చిహ్నామని ఉన్నారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా రోబోటిక్స్ ఆటోమేషన్ లపై విశాల్, బీబిక్స, సీనియర్ రోబోటిక్స్ మెంటర్ గ్రహణ కల్పించడం జరిగిందని,2 రోజులు రోబోటిక్ పై శిక్షణ లపై అందించడం జరుగుతుందని చెప్పారు.అనంతరం గురుత్వాకర్షణ శక్తి పై కృత్యదారంగా విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో రిపోర్ట్స్ పర్సన్ జాకీర్ హుస్సేన్ కె తిరుపతి.రాజేశం ఉపాధ్యాయులు కుమార్, హరిప్రసాద్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking