మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.

 

మెదక్ పార్లమెంట్ పరిధిలో 54 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు
మెదక్ ప్రాజబలం న్యూస్ :-
స్కూటీని ద్వారా 53 అభ్యర్థుల నామినేషన్ ఆమోదించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్”

(01) ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు నరసింహులు గౌడ్ సంగారెడ్డి నామినేషన్ తిరస్కరణ
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది.

ఎన్నికల సాధారణ పరిశీలకులుగా సమీర్ మాధవ్ కుర్త్కోటి, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా.. పలు పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు.

మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కు54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 53 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని(01) నామినేషన్ తిరస్కరించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.

. మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆర్. ఓ.కార్యాలయం లో శుక్రవారం కొనసాగుతున్న స్క్రూటినీ ప్రక్రియ…
స్క్రూటినీ లో అవలంబించనున్న విధానాలను నామినేషన్ వేసిన అభ్యర్థులకు తెలియజేసిన రిటర్నింగ్ అధికారి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అభ్యర్థులకు సూచించిన ఆర్. ఓ..

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 25 వరకు కొనసాగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 54 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కళ్ళు నరసింహులు గౌడ్ ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త ఓటర్ల లిస్టు, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, ప్రపోజల్స్ సరైన పత్రాలు సమర్పించని సందర్భంలో స్క్రూట్ నీలో భాగంగా నామినేషన్ను తిరస్కరించడం జరిగిందని వివరించారు. 53 మంది నామినేషన్లను ఆమోదించడం జరిగిందని చెప్పారు.

 

రేపు కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ఉంది కాబట్టి నామినేషన్ ఉపసంహరణకు చేసుకునేవారు. ఈరోజు 5 గంటల తర్వాత నుండి ఉపసంహరణ ఫామ్ సబ్మిట్ చేయవచ్చని, తదుపరి 29.04.202 సోమవారం సబ్మిట్ చేయాలని చెప్పారు.
అభ్యర్థి వ్యయానికి సంబంధించి సంబంధించిన పుస్తకాలు అభ్యర్థులకు అందజేయడం జరిగిందని నామినేషన్ వేసిన అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించినప్పుడు ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. అభ్యర్థుల ఖర్చులు ఆ అకౌంట్ ద్వారానే నమోదు చేయడం జరుగుతుందన్నారు

ఎలక్షన్ ఏజెంట్ రాండిమైజేషన్ ప్రక్రియలో హాజరుకావాలని అసెంబ్లీ కాన్స్టెన్సీ పరిధిలో పోలింగ్ స్టేషన్స్ అలాట్మెంట్ చేయడం జరిగిందని ఈవీఎం రిలేటెడ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని హోమ్ ఓటింగ్ ప్రక్రియలో 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు 40% పైబడిన వికలాంగులకు ఫారం 12 డి అందజేయడం జరిగిందని ఏ రోజు ఎక్కడ హోమ్ వోటింగ్ జరుగుతుందనే పూర్తి వివరాలు లిస్ట్ అందజేయడం జరుగుతుందని బూత్ లెవెల్ ఏజెంట్ హాజరై ఓటింగ్ ప్రక్రియను పరిశీలించవచ్చని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఆర్డీవో నరసాపూర్, ఆర్డీవో మెదక్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో పోస్టల్ ఓటింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు .

ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాన్ని పరిశీలించవచ్చని అన్నారు ప్రతిరోజు నివేదికల మీద పొలిటికల్ పార్టీ ప్రతినిధుల సంతకాలు చేయవలసి ఉంటుందనిఅన్నారు. క్రిమినల్ కేసులు వివరాలు కి వస్తే ముగ్గురు అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఉన్నాయని రఘునందన్ రావు (బిజెపి) నీలం మధు( కాంగ్రెస్) వెంకటరామిరెడ్డి (బి ఆర్.ఎస్) మూడుసార్లు న్యూస్ పేపర్లో వారికి ఇచ్చిన C1,C2,C3 ప్రొఫార్మాలు ప్రచురణ చేయాల్సి ఉంటుందని దానికి సంబంధించిన తేదీలు కూడా
వారికి నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసినప్పుడే చెప్పడం జరిగిందని అన్నారు ర్యాలీలు, సభలు సమావేశాలు నిర్వహించి నప్పుడు తప్పనిసరిగా ఏఆర్ఓ నర్సాపూర్, ఏఆర్ఓ మెదక్ 48 గంటల ముందు అనుమతి కొరకు సువిధ పోర్టల్ లో దరఖాస్తు చేయవలసి ఉంటుందని 24 గంటలు లోపు అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు అనుమతి లేకుండా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు.
అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులుగా సమీర్ మాధవ్ కుర్త్కోటి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు
మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో
ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించడానికి రిటర్నింగ్ అధికారి తీసుకుంటున్న చర్యలు ,చెక్పోస్టుల ద్వారా తనిఖీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల నమోదు
క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని ఇదే వరవడి కొనసాగించి
ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే విధంగా చూడాలన్నారు
ఈ కార్యక్రమంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking