ప్రభుత్వ పాఠశాల కిటికీలు ధ్వంసం

 

ప్రజాబలం దినపత్రిక – నిజాంపేట మండలం
09-09-2024:

మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని ( కే) వెంకటాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ కిటికీలు అద్దాలను, బండలను ధ్వంసం చేసినట్టుగా, స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. వినాయక చవితి పండుగకు రెండు రోజులు సెలవు రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. గత కొన్ని రోజుల నుండి కూడా ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయని కిటికీలతోపాటు, బుక్స్, సామాగ్రి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని అధికారులు పట్టించుకోవాలని స్థానికులు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking