ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దొంగలు ఆలయం తాళం పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తెలు,రాగి చెంబు, ప్లేటు ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు 16 వేల 1వంద రూపాయలు ఉంటుందని పోలీస్ స్టేషన్ ఆలయ నిర్వాహకుడు మెడి బిమయ్య ఫిర్యాదు చేశారు.బుధవారం ఉదయం మంచిర్యాల నుండి ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీం బృందం వచ్చి దొంగతనం తీరును పరిశీలించడంతో పాటు ఫింగర్ ప్రింట్స్ సేకరించి దర్యాఫ్తు చేయడం జరుగుతుంది.లక్షెట్టిపేట ఎస్సై పి సత్తిష్ తెలిపారు.