వీణవంక ప్రజాబలం ప్రతినిధి జూలై 31
‘సేవే మార్గం’గా పయనిస్తూ..నలుగురికి ఉపయోగపడే పనులు చేయడానికి అడుగులు వేస్తున్న యువకుడిని వలువురు అభినందిస్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా తన ఊరికి తాను తోచినంతలో సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు సదరు యువకుడు. అతనే వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్..రెండు పదుల వయసులోనే సమాజం కోసం ఆలోచించి తన వంతుగా శక్తి మేరకు సేవలు అందించడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల లస్మక్కపల్లి-నర్సింగాపూర్ ప్రధాన రహదారిపై తుమ్మ చెట్లు రోడ్డు వైపునకు వాలి..రోడ్డుకు అడ్డుగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన ప్రశాంత్ తన సొంత డబ్బుతో జేసీబీని పిలిపించి..దగ్గరుండి రోడ్డుకు ఇరువైపులా ఇబ్బందికరంగా ఉన్న చెట్లను తొలగించారు.
జేసీబీ సాయంతో రోడ్లపైన విరిగిపడ్డ చెట్ల పెద్ద కొమ్మలను సైతం తీసేపించారు. గ్రామానికి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ పనులు చేయించారు. దాంతో పాటు బురదమయమైన రోడ్డును సైతం మొరం పోయించి చదును చేయించారు. సొంత ఖర్చుతో బురద ఉన్న చోట మొరం పోయించి స్వయంగా ప్రశాంత్ సైతం పార పట్టుకుని రోడ్డుపైన మొరం చదును చేసి దారిని బాగు చేశారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న ప్రశాంత్ వంటి యువనాయకుడు భవిష్యత్తులో తప్పకుండా రాణిస్తారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాజికంగా నలుగురికి ఉపయోగపడే పనులు చేపడుతున్న ప్రశాంత్‌ను అభినందిస్తున్నారు.