ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
ఎల్బీనగర్ మే 25 ;: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం గుర్తు పై గెలిచి,బిఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ పేరు ప్రతిష్టలు, కార్య కర్తలు, ఉద్యమ నాయకులు, తల దించుకునేలా భూ కబ్జాలకు పాల్పడుతు భూ బకాసురుడుగా మారిపోయారని ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముద్ద గౌని రామ్మోహన్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం బి.ఎన్.రెడ్డి నగర్ తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ అభివృద్ధికి తాను చేసిన కృషి అంతా నేనే చేశానని గొప్పలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు నాయుడు భిక్ష వల్లనే ఎమ్మెల్యేగా గెలుపొంది బిఆర్ఎస్ పార్టీ ని నియోజకవర్గ పరిధిలో భ్రష్టు పట్టిస్తున్నాడని, ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెద్ద శని లా తగిలాడని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ నీచ రాజకీయాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నాడని అధికార పార్టీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ లు విమర్శించడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కోట్ల విలువగల భూములను కబ్జాలు చేసిన చిట్టా పేపర్లతో సహా నా దగ్గర ఉందని, ఎల్బీనగర్ చౌరస్తా శ్రీకాంత్ చారి విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమేనా అని సవాలు విసిరారు.రౌడీషీట్ ఎవరిపై పెడతారో కూడా తెలియని మూర్ఖుడు ఎమ్మెల్యే అని అన్నారు. అనునిత్యం బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరే వ్యక్తి నని, ఎమ్మెల్యే అవినీతి బాగోతం అధిష్టానికి ఏనాడో చేరవేశానని,బిఆర్ఎస్ పార్టీకి తాను సొంత కొడుకునని,ఎమ్మెల్యే అద్దె కొడుకని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో కాబోయే ఎమ్మెల్యే నేనే అని జోస్యం చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమని, నా నీతి నిజాయితీని శంకించాల్సిన అవసరము లేదని స్పష్టం చేశారు.నియోజకవర్గంలో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న ప్రజలకు సేవ చేయడానికి ముందు వరుసలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ సుధీర్ రెడ్డికి రాదని తేల్చి చెప్పారు. నువ్వే నాకు బద్ధ శత్రువు నీపై విజయాన్ని సాధించే వరకు నిద్రపోనని ప్రతిజ్ఞ చేశారు. పని చేసే పాత్రికేయుల ఇండ్ల స్థలాలు ఇప్పించడంలో తన వంతు కృషి చేస్తానని, ఇళ్ళు కట్టుకొనే వారికి ఖర్చు లో 25శాతం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు లక్ష్మీ ప్రసన్న గౌడ్, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు ప్రేమ్ నాథ్ గౌడ్ ,త్రివేది తదితరులు పాల్గొన్నారు.