ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని బిసి వసతి గృహానికి కేటాయియిస్తాం
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
కలెక్టర్ తో కలిసి పలు అభివృద్ధి పనులు పరిశీలన
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 01: మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి రాజీ పడే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పనులను పరిశీలించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి సౌకర్యలతో ముప్పై పడకలు ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను బీసీ వసతి గృహానికి కేటాయిస్తున్నామని, ఇందులో నూట ఎనభై మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి ఏర్పాటు చేస్తామన్నారు.ఈ నెల 20 నుండి హాస్టల్ పనులు ప్రారంభమౌతాయన్నారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీపడభోమని ఆయన స్పష్టం చేశారు.మండలంలో ఫైర్ స్టేషన్ లేనందున త్వరలోనే మున్సిపాలిటీలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, జిల్లా ఆర్ జీ పీ ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణ చందర్ రావు,మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,వార్డ్ కౌన్సిలర్ లు,మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.