నేటి మహిళా చైతన్యానికి ఇందిరమ్మయే నిజమైన స్ఫూర్తి

 

ఇందిరమ్మ వర్ధంతి వేడుకలలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఇల్లందు ప్రతినిధి నవంబర్ 1 (ప్రజాబలం) నేటి మహిళా చైతన్యానికే కాకుండా, యువ రాజకీయ నాయకులకు, ఇందిరా గాంధీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయిందని నాలుగు దశాబ్దాల మరణానంతరం కూడా భారతదేశము ఇందిరమ్మ యొక్క పథకాలను గుర్తు చేసుకుంటుందని, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతిని పురస్కరించుకుని ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ కూతురిగా, ఒక ప్రధానమంత్రిగా దేశ రాజకీయ చిత్రపటాన్ని, నైసర్గిక స్వరూపాన్ని మార్చి, అప్పటివరకు మన దేశ సైన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో గెలవడం జరిగింది. ఫోక్రాన్ లో అణు పరీక్షలు జరిపించి ప్రపంచానికి భారతదేశ సత్తా ఏమిటోచూపించింది. గరీబీ హటావో అనే నినాదంతో దేశమంతటా 36వేల కిలోమీటర్లు యాత్రలు చేసి దాదాపు 300 సభలు నిర్వహించి ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలని ప్రయత్నం చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. తన రాజకీయ ప్రత్యర్థుల కుట్రలను చేదించడానికి ఎమర్జెన్సీ ప్రకటించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని, తెలిపారు. ఎంతో మేధావిగా పేరు పొందిన ఇందిరాగాంధీ తన స్వగృహంలో అక్టోబర్ 31 1984 న, తన అంగరక్షకుల చేత హత్య గావించపడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో శీలం పుల్లయ్య, భూక్య నాగేంద్రబాబు, గుగులోతు రవి, పాటిబండ్ల ప్రసాదు, మేకల మహేష్ బాబు పల్లపు ప్రతాప్ కుమార్, బొగ్గారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking