నేతకాని సమాజాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు

 

-మాల సంఘం నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునర్కార్ రాంబాబు నేతకాని

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్
పిబ్రవరి 10:

నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సునార్కర్.రాంబాబు నేతకాని అధ్యక్షతన మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి జరిగిన అన్యాయం గురించి హైదరాబాద్ వేదికగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నేతకాని కులానికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, రాష్ట్ర అధ్యక్షులు దుర్గం. రాజేష్ లు గ్రూప్ 3 లో మాలలతో పాటు నేతకాని కులాన్ని చేర్చటం వల్ల నేతకాని కులంలో ఉన్న చదువుకునే విద్యార్థులకు, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిని ఓర్వలేని మాల సామాజిక వర్గానికి చెందిన పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి నేతకాని కులం పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత,రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం. రాజేష్ లను ఇష్టానుసారంగా మాట్లాడి కించపరచడం తగదన్నారు. ఎస్సీ వర్గీకరణలో నేతకాని సామాజిక వర్గ జనాభాని తక్కువ చూపించడం, గ్రూప్ 3 లో ఉంచడం వల్ల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తే మాల సామాజిక వర్గంలోని కొంతమంది పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాక మాదిగ, బీసీ కులాలను కూడా అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని నేతకాని మహర్ కుల పరిరక్షణ సంఘం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేతకాని సామాజిక వర్గం నుంచి బోర్లకుంట వెంకటేష్ నేత గారు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యంవహించడాన్ని ఓర్వలేక నేడు మాల సంఘం నాయకులు నేతకాని సమాజాన్ని అణచివేసే కుట్రలు చేస్తుందన్నారు. ఓవైపు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్యే వివేక్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరగా అందుకు విరుద్ధంగా మందమర్రి మాల సంఘం నాయకులు నేతకాని కులాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ నేతకాని, మాదిగ, బీసీ కులాల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో అన్ని కులాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో
రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు గోలేటి లక్ష్మి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజ్, ప్రధాన కార్యదర్శి దుర్గం సంతోష్, మండల నాయకులు దుర్గం రాజయ్య లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking