ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ పిబ్రవరి 10 :
కరీంనగర్-మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫుట్కూరి నరేందర్ రెడ్డి సోమవారం తన నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మద్దతుగా ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ బి.జనక్ ప్రసాద్, సింగరేణి ఐ.ఎన్. టీ. యూ. సి నాయకులు ధర్మపురి, కాంపెల్లి సమయ్య, లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, ఏనుగు రవీందర్ రెడ్డి , అక్బర్ అలీ, శంకర్ నాయక్, దశరథం, సంగ బుచ్చయ్య, కొంగర రవీందర్, మల్లికార్జున్ లు పాల్గొన్నారు. అనంతరం నరేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.