అశ్వరావుపేట ఎస్సై శ్రీను మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

అడ్వకేట్ జగన్ మోహన్, బిఎస్పీ,నిర్మల్ జిల్లా ఇంచార్జీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతికి కారణమైన సీఐ జితేందర్ రెడ్డి,మరియు కానిస్టేబులను తక్షణమే అరెస్టు చేసి సర్వీస్ నుండి రిమూవ్ చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ జగన్ మోహన్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూ..
సామాన్య ప్రజానీకానికి భరోసా కల్పిస్తూ వారికి రక్షణను ఇవ్వవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారే అందులో పని చేసే అణగారిన వర్గాలపై కులవివక్ష చూపుతూ, ఆధిపత్య కుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకొవాలన్నారు,రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన కూడా వివిధ సంస్థలలో వివక్షత చూపడం సబబు కాదని,శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధికి చెందినప్పటికిని ఇప్పటికీ కుల వ్యవస్థ చూపడం దుర్మార్గమని అన్నారు.రాష్టంలో మరల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని,ఉజ్వల భవిష్యత్తు ఉన్నపోలీసు అదికారి మరణించడం బాధకరం అని, ఎస్సై శ్రీ రాముల శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఎస్సై కుటుంబానికి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని మరియు కోటి రూపాయల ఎక్సిగ్రేషియా,ఫాస్ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తక్షణమే నిందితులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking