ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 8

జమ్మికుంట గాంధీ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర రమేష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సజ్జు ల ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ 9 గంటల ఉచిత కరెంటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఆరోగ్యశ్రీ, 108, 9 రకాల వస్తువుల రేషన్ షాపులో సరుకులు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చెరుగని ముద్ర వేసుకున్న మహోన్నతమైన మనసున్న మహారాజు రాజశేఖర్ రెడ్డి వారికి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జు, కౌన్సిలర్ దిడ్డి రాము, ఎర్రం సతీష్. ఎండి ఎన్ ఎస్ యు ఐ మండల ప్రెసిడెంట్ వాసల సుధీర్, ఎండి రంజాన్, దొడ్డే నవీన్, పతకాల రమేష్, రోమాల రాజు కుమార్, యాట్ల అశోక్, దొడ్డే శ్రీకాంత్, శంకర్ మిడిదొడ్డి, పతకాల అనిల్, మహమ్మద్ ఆశ్రఫ్, అనిల్, నర్సయ్య ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking