ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 8:
పారిశ్రామిక మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో కోర్ బ్రాంచుల ఇంజనీర్ల పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది, కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఏఐసిటిఈ (యశస్వి) యంగ్ ఎచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలీస్టిక్ అకాడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ అనే పేరుతో 2024-25 సంవత్సరం కోర్ బ్రాంచలలో చేరిన విద్యార్థులకు వారి యొక్క ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా దేశంలో ఇంజనీరింగ్ 5000 మరియు డిప్లమా లో చేరిన 5000 మంది విద్యార్థులకు 18000 మరియు 12000 చొప్పున స్కాలర్షిప్ అందజేసే కార్యక్రమానికి ఏఐసిటిఈ పూనుకుంది. ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సావిష్కార్ కన్వీనర్ మరియు టెక్నికల్ సెల్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి నాయకుడు తోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐసిటిఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని, అదేవిధంగా కనుమరుగైపోతున్నటువంటి కోరు బ్రాంచ్ లను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్టి బ్రాంచ్లలో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్లను 35 వేల కంటే ఎక్కువ ఇవ్వాలని తద్వారా అట్టి బ్రాంచ్లలో ఎక్కువ మంది విద్యార్థులు చేరే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలలో కోర్ ఇంజనీరింగ్ విద్యార్థుల పాత్రను పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు.