ఐలమ్మ విగ్రహం దిమ్మే ను కూల్చి రజకుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

 

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కాకరవాయి గ్రామం లో ఇటీవల తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం దిమ్మే ను కూల్చి, రజక సంఘానికి చెందిన యువకులపై దాడి చేయడాన్ని సమైక్య రజక సంఘం జిల్లా సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, డీసిఎంఎస్ డైరెక్టర్ జక్కుల లక్ష్మయ్య, జిల్లా కన్వీనర్ రేగళ్ల సీతారములు, రేగళ్ల కొండలు, జక్కుల వెంకటరమణ లు ఒక సంయుక్త ప్రకటనలో ఖండించారు. నాడు తెలంగాణ సాయుద పోరాటంలో దొరల దురాఘతాలకు వ్యతిరేకం గా అన్ని వర్గాల వారిని కూడగట్టి పోరాటం చేసి వేల ఎకరాలను పేదలకు పంచిన చాకలి ఐలమ్మ ను స్మరించుకుంటూ విగ్రహం ఏర్పాటు చేస్తే కొంతమంది కావాలని గొడవ చేసి విగ్రహం దిమ్మెను స్వల్పంగా ధ్వంసం చేసి రజకులపై దాడిచేయటం అమానుషమని. పోలీస్ అధికారులు విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని వారు కోరారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking