రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి 11 (ప్రజాబలం సిరిసిల్ల నియోజకవర్గం ప్రతినిధి)
17వ పోలిస్ బెటాలియన్ సర్దాపూర్ లో కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న తోట గంగారామ్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ ప్రమాదంలో సోమవారం రోజున మరణించారు.ప్రమాదవశాత్తు మరణించిన 17 వ బెటాలియన్ కమాండెంట్ గంగారామ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఏఎస్పి చంద్రయ్య , డిఎస్పి చంద్రశేఖరరెడ్డి 1 వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, 3వ బెటాలియన్ కామండెంట్ జమీల్ ఫాష 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, రాందాస్,బెటాలియన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.