ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 11
మద్యం మత్తులో తాగునీరు ఇవ్వలేదనే సాకుతో కందుల కుమార్ అనే వ్యక్తి పొగిడి
రాంబాయి అనే మహిళపై పాశవికంగా గొడ్డలితో దాడి చేసిన కేసులో నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. శశిధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ ఎస్ఐ శివ నీతి రాజశేఖర్ తో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. మందమర్రి పట్టణంలోని పాత సీఎస్సీ
రోడ్డులో నివాసమున్న కుమార్ కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యం బారిన పడ్డాడని తెలిపారు. అప్పటి నుండి ఆర్కే- 5 ఏరియా నస్పూర్ కాలనీకి కుటుంబంతో సహా వెళ్లి అక్కడే
ఉంటున్నాడని, నాలుగు రోజుల క్రితం పాత సీఎస్సీ రోడ్డులోని తన తల్లి ఇంటికి వచ్చాడన్నారు.
మద్యం సేవించిన కుమార్ సోమవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల
ప్రాంతంలో రాంబాయి ఇంటికి వెళ్లి త్రాగేందుకు నీరు
కావాలని అడిగాడు. రాంబాయి కుమారుడు రవికుమార్ తాగేందుకు నీరివ్వగా వాటిని తాగి
వెళ్లిపోయాడు. మళ్లీ కొంచెం సేపటికి వచ్చి నీరు కావాలని అడిగగా రాంబాయి నీళ్లు లేవని
సమాదానం చెబుతూ ఖాళీ బిందెను చూపించింది. దీంతో మీరు కావాలనే
తాగేందుకు నీరు ఇవ్వడం లేదని బయటకు వెళ్లి గొడ్డలి తీసుకుని వచ్చి దాడికి తెగపడ్డాడనారు. ఇంట్లో
ఉన్న రవికుమార్ బయటకు వచ్చే లోపల కుమార్ ఫరారయ్యాడని వెంటనే సమాచారాన్ని పోలీసులకు
అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాంబాయిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి
తరలించారని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ తలించారన్నారు. రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు
నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తుండగా మంగళవారం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద
పారిపోవడానికి సిద్ధంగా ఉండగా నిందుతున్నీ అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్లు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్సైలు నూనె శ్రీనివాస్, మాజీద్, కానిస్టేబుల్ రాజేందర్ లు పాల్గొన్నారు.