తుమ్మల, భట్టి, ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మేకల మల్లి బాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 15 (ప్రజాబలం) హైదరాబాద్ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ చేనేత జౌళి సహకార శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ల ను హైదరాబాదులోని వారి కార్యాలయాలలో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు వారిని ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కలిసి పుష్పగుచ్చం అందించి , శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
తదనంతరం మల్లి బాబు యాదవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈరోజు చాలా శుభదినం అని, తెలంగాణ రాష్ట్ర నిరంకుశ గడీల పాలన ను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని, ముఖ్యంగా ఖమ్మం జిల్లా నాయకులు చాలా కీలక పాత్ర పోషించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలో ప్రధాన శాఖలు కేటాయించడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీలల్లో రెండు హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చారని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా 100 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని, అధికారం చేపట్టిపట్టుమని పది రోజులు కూడా కాకుండానే హామీలు నెరవేరుస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి తమ ఉనికి ఎక్కడ కోల్పోతామో నన్న భయం తో బిఆర్ఎస్ నాయకులు తమ పాత బుద్ధి పోనిచ్చుకోక, ఇంకా అధికారంలో ఉన్నావేమో నన్న ధ్యాసలో మాట్లాడుతున్నారని, ఈ పద్ధతిని ఇకనైనా మార్చుకోవాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో వాగదాని పుల్లారావు గంగదేవుల లోకేష్ యాదవ్, కమర్థపు మురళి నాగ సీతారాములు, తోటకూరి శివయ్య, షేక్ పతే మహమ్మద్,వడ్లమూడి దుర్గాప్రసాద్,మూల మధుకర్ రెడ్డి, భూక్య ప్రవీణ్, ప్రభాకర్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking