– సేవే తన లక్ష్యం.. ప్రజా సంక్షేమమే తన ధ్యేయం..
– పిలిస్తే పలుకుతారు.. ముద్దుగా ( శీనన్న)..
– కార్యకర్తలే తన అండ దండ.. ప్రజల ఆశీస్సులే తన బలం
– కాంగ్రెస్ గెలుపులో “కీ” రోల్..
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం పంతం పడితే నెగ్గాల్సిందే అనుకున్నది సాధించాల్సిందే ప్రజలే తన బలం ప్రజలే తన ఆస్తి ఉన్నదాంట్లో ప్రజల సమస్యలను తీర్చడంలో సొంత ఆర్థిక సహాయం చేయడంలో తనకు తానే సాటిగా నిలిచారు. పేదలకు అండ దండ. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి కష్టాలను స్వయంగా చూసి.. ఉన్నత ఆశయాల వైపు అడుగులు వేసి అంచలంచలుగా ఎదిగి అందరికీ అందనంత ప్రజా హృదయంలో వెలుగొందుతున్నారు. అన్నా అంటే పలుకుతున్నారు. కష్టము ఉందంటే ఆదుకుంటున్నారు. పారిశ్రామిక రంగంలో… తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అన్ని రాష్ట్రాలలో… తన హవా కొనసాగాల్సిందే. కాంట్రాక్టర్ గా మంచి పేరును సంపాదించుకున్నారు. మంచితనముతోనే ప్రజల హృదయాలను గెలుస్తున్నారు. సాటి రారు మరెవ్వరు .. వీరికి అన్నట్టుగా ప్రజల గుండెల్లో పదిలమై నిలిచారు. ఎంతటి కష్టానైనా జయించారు. ఎంతటి వారినైనా ఎదిరించారు. సవాళ్లను అధిగమించారు. ప్రజా బలమే నా బలమంటూ.. ముందుకు సాగారు. పోలీస్ ఐటి సోదరులు సైతం లెక్కచేయలేదు. అందుకేనేమో ప్రజలు పట్టం కట్టారు. ఇదంతా.. ఎవరి గురించో మీకు తెలుసండి. వీరేనండి బిఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరి గద్దె దింపుతామంటూ బహిరంగ ప్రకటనలు గుప్పించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో “కి” రోల్.. ప్రదర్శించి లెక్కచేయకుండా ప్రజా ఆశీస్సులు అందుకుని మంత్రయ్యారు. వీరేనండి మనందరి సుపరిచితులు. ప్రజల ఆరాధ్య దైవం. ప్రజలందరూ ఇష్టదైవంగా ఇష్టంగా పిలిచే శీనన్న ముద్దు పేరుగా పిలిచే మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వీరిపై ప్రత్యేక కథనం మెట్రోలో మీ అందరి కోసం.. బిఆర్ఎస్ పై పంతం.. పట్టి బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సవాలు నెగ్గించుకున్నారు. పంతం పట్టి పంతం నెగ్గారు. వీరు ఖమ్మం జిల్లాలోని.. కల్లూరు మండలం నారాయణపురం గ్రామం స్వగ్రామం. నవంబర్ 4 1959లో జన్మించారు. వీరికి వీరి సతీమణి మాధురి జీవిత భాగస్వామి తోడు నీడ. సంతానం కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె సప్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే వీరికి చాలా ఇష్టం. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ అరగటం చేసి ఖమ్మం జిల్లాలో ఎంపీగా పోటీ చేసి నామా నాగేశ్వరరావు పై గెలుపొందారు. వీరుతోపాటుగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యే సైతం గెలిపించారు. జరిగిన పరిణామం లో… రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేని పరిస్థితుల్లో.. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వారి ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రముఖ పాత్రను పోషించారు. కొద్దికాలంలోనే.. బిఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో.. గడవల పరిస్థితుల్లో బయటకొచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవను సైతం చేశారు. అయినప్పటికీ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు కొన్ని వర్గాలకే బిఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించకపోవడం వారి అనుచర వర్గీలకు ప్రాధాన్యత దక్కట్లేదనే భావనతో బయటికి వచ్చే పరిస్థితుల్లో కేసీఆర్ కేటీఆర్ ను సైతం ధిక్కరించి.. అధికారాన్ని సైతం వీడనాడి.. బిఆర్ఎస్ పై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి.. వారి అనుచర వర్గానికి టిక్కెట్లు ఇప్పించి దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 ఎనిమిది కాంగ్రెస్ ఒకటి సిపిఐ గెలుపునకు నిరంతరం కృషిచేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్రను పోషించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలేరు ప్రజల దీవెనలతో కందాల ఉపేందర్ రెడ్డి పై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇంతటి మెజార్టీ రావడానికి ప్రజల మనలను అందుకున్నారు. కష్టం వచ్చిందంటే చాలు సొంత ఆర్థిక సాయం మంచినీళ్లులా ఖర్చు చేస్తారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కార్యకర్తలకు అండగా నిలిచారు. కష్టం వచ్చిందంటే ఆదుకున్నారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. మీ శీనన్న మీ అండగా ఉండగా మీకు లేదు చింత అన్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్యకర్తలకు నమ్ముకున్న వారికి అండగా నిలిచి.. వారందరికీ న్యాయాన్ని చేకూర్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులకు నాంది పలికారు. ఆ గెలుపులో భాగస్వామి అయి.. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, రెవెన్యూ శాఖ మంత్రిగా డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేశారు. 14న సచివాలయంలో… పదవి బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తం తో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో తన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు… వారి అనుచర వర్గముతో హాజరై.. పండుగ వాతావరణం వలె వేడుక జరిపించారు. అందుకేనేమో కార్యకర్తలు అభిమానులు, అంత అండగా పొంగలేటి ఉన్నారు అన్న నేపథ్యంలోనే ఇంతటి ఆదరాభిమానాలు ప్రజలు చూపిస్తున్నారనేది ప్రజలు ఇచ్చిన తీర్పులే నిదర్శనం అంటూ పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజా దీవెనలతో గెలుపొందిన “శీనన్న” మరింత .. ఉన్న తెచ్చే పదవులతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యలను తీరుస్తూ, అందరి ఆధార అభిమానులు అందుకుంటూ, ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ.. మరింత ముందుకు సాగాలని పలువురు కోరుతున్నారు.
పిలిస్తే పలుకుతారు..ముద్దుగా (శీనన్న)
ఆంధ్ర రాష్ట్రం తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ అందరికీ తెలిసిన ఏకైక మచ్చలేని మంచి మనిషి మంచి చేసే మనిషి ఒకే ఒక్కడు ప్రజా నాయకుడు పిలిస్తే పలికే నేత ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే శీనన్న… ప్రజా ఆశీస్సులతో ప్రజల అండదండలతో బీఆర్ఎస్ కు సవాలు విసిరి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గెలుపులో తనకంటూ ఒక ప్రత్యేక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ప్రజా ఆశీస్సులతో ప్రజల అండదండలతో ప్రజల దీవెనలతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చక చక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు పరితపిస్తూ ప్రజల మన్నలను అందుకుంటూ, చక్కటి చూడనైన పాలనను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తూ.. మంచి కోసం పరితపిస్తూ ముందుకు సాగుతున్నారు. అందరి నోట శభాష్ సంపించుకుంటున్నారు