కలెక్టరేట్‌లో పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం కలెక్టరేట్‌లో పెండింగ్ ఫైళ్లు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి ఫైలును వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర ఫైళ్లపై అలసత్వం చూపకూడదని, ఆర్డీవో, తహసీల్దార్, సంబంధిత అధికారులను సంప్రదించి, వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ అవసరాలకు స్థల కేటాయింపు ఫైళ్లపై వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. సఖి భవనం, మండల కేంద్రాల్లో సివిల్ సప్లయిస్ శాఖకు నిల్వ కొరకు ఎమ్మెల్యే పాయింట్స్, ఎస్సి స్టడీ సర్కిల్, ఫైర్ సర్వీస్ వారికి శిక్షణ కేంద్రం, సెంట్రల్ ట్యాక్స్ కార్యాలయం, సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ కు గోడౌన్ల నిర్మాణం తదితరాలకు స్థల సేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల, పిఓబీ ఎన్ఓసి లను పరిష్కరించాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లోని డొంకల్లో ఆక్రమణలు తొలగించి, ఉపాధి హామీ ద్వారా రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సి, ఎస్టీ కమీషన్, ఎసిబి, క్రమశిక్షణ చర్యలకు సంబంధించి చర్యలు పెండింగులో ఉండకుండా చూడాలన్నారు. సూపరింటెండెంట్ లు, సెక్షన్ సహాయకులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని, ఫైళ్ల పరిష్కారం త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. సెక్షన్ల వారిగా పెండింగ్ ఫైళ్లపై కలెక్టర్ సమీక్షించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మీనన్, మదన్ గోపాల్, సత్యనారాయణ, ఇడిఎం దుర్గాప్రసాద్, ధరణి కోఆర్డినేటర్ శ్రీనివాస్, వివిధ సెక్షన్ ల సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking