తూప్రాన్ వీరాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు

 

ఆదివారం నుండి ప్రారంభం.
కలియుగ దైవం సామూహిక
సత్యనారాయణ వ్రతాలు
ఆత్రేయ శర్మ.
మెదక్ తూప్రాన్ ఏప్రిల్ 20 ప్రజాబలం న్యూస్ :-

తెలంగాణ రాష్ట్రంలో రెండవ కొండగట్టుగా పేరుగాంచిన ప్రకృతిపరమైన రమనీయమైన గుట్టలు పట్టణానికి ముఖ్యమైన పెద్ద చెరువు నీళ్లు ఒక ప్రక్కా పంట పొలాలు మధ్య వెలసిన మహిమగల తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయ మందిరం జయంతి ఉత్సవాలకు ముస్తాబయింది. తూప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ మాలదరణ మండల దీక్ష స్వాములు ఉదయాన్నే లేచి భక్తితో శ్రీ రామనామ స్మరణతో జపము ప్రదక్షణ ఆలయ మందిరం రామనామ ఆంజనేయ స్మరణతో మననతో ఈ ప్రశాంత వాతావరణంలో రామనామ స్మరణ మనసంతా రంజింప చేస్తుంది. చేర వచ్చిన భక్తులకు కోరినా కోరికలను తీర్చిన కలియుగ దైవం శ్రీ ఆంజనేయ స్వామిగా పేరుపొంది ఉన్నాడు .ఆలయ అర్చకులు హనుమాన్ గురుస్వాములు సలక ఆత్రేయ శర్మ , గడ్డం ప్రశాంత్ కుమార్, మల్లికార్జున్ గౌడ్ , శేఖర్ మాట్లాడుతూ దశాబ్దాల జీవన సమరంలో అలసి సొలసిన వారికి అలంబన ఇచ్చే ఆధ్యాత్మిక క్షేత్రమని ఇప్పటికీ కుల మత బేధములు లేకుండా స్వామివారిని కొలుస్తారని, గత 40 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆశేష భక్తుల మధ్య ఇక్కడ ఘనంగా జరుపుతున్నామని, జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఎంతో వైభవోపేతకంగా విద్యుత్ దీపాలు వీర జిమ్మే కాంతుల మధ్యలో అశేష జనవాహిని సమక్షంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని ఆలయ అర్చకులు ఆత్రేయ శర్మ. గురువులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking