మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో అపెక్స్ కమిటీ కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్.
ములుగు, మే22 ప్రాజబలం న్యూస్ :-
ఈనెల 27న జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మున్నూరు కాపు రాష్ట్ర అపెక్స్ కమిటీ కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్కాపల్లి వీజేపీ గార్డెన్ లో నిర్వహించిన మున్నూరు కాపు రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని.. ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్నను రాజకీయ పార్టీలకతీతంగా మొదటి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్యం వేంకటేశ్వర్లు పటేల్, కోశాధికారి విష్ణు జగతి పటేల్, ఒక కులం ఒకే సంఘం అన్ని జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మున్నూరు కాపులు తదితరులు పాల్గొన్నారు.