దళిత బాలికల పాఠశాలల స్థాపన ద్వారా భాగ్యరెడ్డి వర్మ బాలిక విద్యకు చేసిన కృషి చిరస్మరణీయం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 22 : దళిత వైతాళికుడు, సంఘసంస్కర్త అయిన భాగ్యరెడ్డి వర్మ దళిత బాలికల పాఠశాలలను స్థాపించి బాలిక విద్యకు చేసిన కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో కల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు బుధవారం జిల్లాలోని నస్పూర్ లో కల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)సబావత్ మోతిలాల్, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సమాజంలో అసమాన తలను తొలగించి దళిత బాలికలకు విద్యను అందించేందుకు 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి బాలికల అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని అన్నారు.వివిధ సంఘాలు, మండలిలను స్థాపించి సంఘసంస్కరణ కోసం ఎంతో కృషి చేశారని,ప్రజలకు సమానత్వం,సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అందించేందుకు ధనవంతు పాత్ర పోషించారని అన్నారు.నిరక్షరాస్యత వల్ల ప్రజలు ఎంతో వెనకబడి ఉన్నారని వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి పాటుపడాలని ఆదర్శంగా నిలిచారని అన్నారు.భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని,మహనీయులు ఆచరించిన మార్గాలను అనుసరించడం ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, లీడ్ డిస్టిక్ మేనేజర్ తిరుపతి,కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,ఎన్నికల తహసిల్దార్ శ్రీనివాస్,సి సెక్షన్ పర్యవేక్షకులు సంతోష్,కలెక్టరేట్ సిబ్బంది,సంబంధిత శాఖల అధికారులు తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking