జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 27, (ప్రజా బలం)
విద్యానగర్ లోని తన ఓపెన్ ఫ్లాట్ లోకి అక్రమంగా చొరబడిన మేకల అనుష అనే మహిళ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే ప్రజావాణిలో ఫిర్యాదు పేరిట డ్రామా ఆడిందని బీఆర్ ఎస్ నాయకులు మంత్రి వేణుగోపాల్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తనకు విద్యానగర్లో ఓపెన్ ఫ్లాట్ ఉందని తన ఖాళీ స్థలం పక్కనే ఇంటిని నిర్మాణం చేసిన మేకల అనూష అనే మహిళ నా ఫ్లాట్ లోని ఈశాన్య భాగంలో అక్రమంగా చొరబడిందని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇదే విషయంలో మునిసిపల్ లో ఫిర్యాదు చేయగా రెండుసార్లు మునిసిపల్ అధికారులు నోటీసులు జారిచేశారన్నారు. తన తప్పును సరిద్దిడ్డుకోవాల్సిన అనూష అనే మహిళ నావద్ద అసలే డాక్యుమెంట్లు లేవని, మంత్రి కొప్పుల అండతో అన్యాయం చేస్తున్నట్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిందన్నారు. మీడియా ముఖంగా తన ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపిస్తానని తన తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇదంతా కొందరు చేసిన కుట్రలో భాగమేనని మంత్రిని ఇందులోకి లాగి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తానని బీఆర్ ఎస్ నాయకులు మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు.