_ఎస్.టి.యు.టి.ఎస్ చే
అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు_
జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 27,(ప్రజా బలం) విదులపట్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, నిబంధనలకు విరుద్ధంగా పలు ఉత్తర్వుల జారీ వంటి పనులతో ప్రభుత్వాన్ని తపుదోవపట్టిస్తున్న జగిత్యాల డీఈవో జగన్మోహన్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తప్పించి సమగ్ర విచారణ జరిపించాలని రాస్ట్రోపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్ ఇతర బాద్యులు అదనపు కలెక్టర్ బి.ఎస్.లతకు ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. గురువారం జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్, కార్యదర్శి మచ్చ శంకర్ లు తమ ఫిర్యాదును కలెక్టరుకు ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టరు కు తమ వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలం గా చెప్పాపెట్టకుండా వెళ్లిన టీచర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి విధుల్లోకి చేరేందుకు పరోక్షంగా సహకరిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన డీఈవో అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ విద్యావ్యవస్థకే మచ్చతెస్తున్నాడని వెంటనే విధుల్లోంచి తప్పించి సమగ్ర విచారణ చేపట్టాలని నిజానిజాలు వెలుగుచూస్తాయని బైరం హరికిరణ్, మచ్చ శంకర్ లు కోరారు.