సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేస్తానన్నా మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్:-
మెదక్ జిల్లా తూప్రాన్ పురపాలక సంఘం పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ నందు మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ మరియు మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీజనల్ డిసీసెస్ పై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులకు నోట్బుక్స్ , బాత్రూమ్స్ , బాగు చేపిస్తానని, నీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పట్లూరి లక్ష్మణ్ పటేల్ పాఠశాలలో ఉన్న వివిధ సమస్యలపై మున్సిపల్ చైర్ పర్సన్ గారి దృష్టికి తీసుకురావడంతో వెనువెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ , జమాల్పూర్ లక్ష్మీబాయి నార్సోజి , కాంగ్రెస్ నాయకులు నాగరాజు మరియు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్.
ఎస్ కుమార్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చింతల మధు,వార్డు ఆఫీసర్లు భాస్కర్ శ్రీకాంత్ దేవరాజు రమేష్
బాబు మరియు జవాన్లు వెంకటేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.