ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన ఈదు ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ఎంపీ కఅభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మరియు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సుగుణ గురువారం ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం లోని ఈద్గమ్ వద్ద ముస్లిం సోదరులకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.శ్రీహరి రావు గారు పిల్లలు ,పెద్దలతో ఆలింగనంచేసుకుంటూ శుభాకాంక్షలు.తెలిపారు.ఈ సందర్భంగ అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ముస్లిం సోదరులు,సోదరీమణులు, నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి అయిదు సార్లు నమాజ్ తో పాటు తరావీహ్ మరియు ప్రత్యేక నమాజ్ ఆచరించి అల్లా ముందు శిరస్సు వంచి విధేయతతో ప్రార్థించారాని ,వివిధ రూపాల్లో పేదలకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.
ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ నిర్మల్ ఈద్గ వద్ద నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు తో పాటు ముస్లిం సోదరీమణులు ,సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీమతి ఆత్రం సుగుణ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం లో సదక,ఫిత్రా ,జకాత్ ,లాంటి ఆచారాలతో పేదలకు చేయూత ఇవ్వడం చాలా గొప్ప కార్యం అని అన్నారు.నెల రోజులు ఉపవాస దీక్షలు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు ,ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ గారితో పాటు.
నాయకులు అర్జుమన్ అలీ. జునేద్ మెమన్. మొహమ్మద్ మతిన్. ఖిజర్. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్.
పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను,మాజీ మునిసిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ,కౌన్సిలర్లు తారక వాణి రఘువీర్,
కొంతం గణేష్ ,పూదరి అరవింద్ ,చిరంజీవి,నర్సారెడ్డి,తదితరులు ఉన్నారు.