మంచిర్యాల జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ప్రజలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.ఉదయాన్నే 8 గంటల ప్రాంతంలో అందరూ ఈదుగా నమాజ్ కు చేరుకున్నారు నమాజులో దువా,ఉపన్యాసం దాని తర్వాత ప్రేమను పంచుకున్నారు చిన్నపిల్లలు పెద్దలు నలుమూలల ప్రాంతాల నుండి లక్షెట్టిపేట లో ఉన్న ఈదుగా వచ్చారు.
శరీరాన్ని కాదు పాపాన్ని కృష్కింపజేసుకోవాలి ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.అదే ఉపవాసం అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం ఇదే రంజాన్‌ ఇచ్చే సందేశo తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి.మంచిర్యాల జిల్లా తో పాటు ఇతర పట్టణాల్లో ఈద్-‌ఉల్- ఫితర్‌ను మతపరమైన ఉత్సాహంతో వైభవంగా జరుపుకున్నారు.దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లవిరుస్తోంది.ముస్లింలు ఈద్గాలు,మసీదుల వద్ద ఈద్ ప్రార్థనలు నిర్వహించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్ ముగింపు సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. ఈ రంజాన్ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నీరు సైతం తీసుకోకుండా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు.ఈ నెల చివరి రోెజైన ఈద్-ఉల్-ఫితర్ ను ఈ నెల రోజులు ఉప‌వాస దీక్ష‌ను విర‌మిస్తారు.. మహమ్మద్ ఆరీఫ్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్.గురువారం జ‌రిగిన వేడుక‌ల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking