అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్న
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11 : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మాహాత్మ జ్యోతిభా పూలేకు భారతరత్న ఇవ్వాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అవునూరి లచ్చన్న,చాతరాజు రాజన్నలు ప్రభుత్వాలను కోరారు.గురువారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో మహాత్మా జ్యోతిభా పూలే జయంతిని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… స్వాతంత్ర్యానికి ముందే బీసీ,ఎస్సీ,ఎస్టీలకు సామజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో సమాన అవకాశాల కోసం పోరాడిన మహనీయుడన్నారు.బహుజన బిడ్డలకు,ఆదివాసీ,దళితులకు చదువు చెప్పి నాగరికులను చేశాడాన్నారు.సామాజిక రుగ్మతలను పారదోలితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పాడన్నారు. అంతకుముందు మండలంలోని రంగపేట, కొమ్ముగూడెంతో పలు గ్రామాల్లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిప్పకుర్తి నారాయణ, తోటపల్లి మహేందర్, కలమడుగు నర్సయ్యా, తోటపల్లి సతీష్,బోలిశెట్టి రవి, కలమడుగు సిసింద్రీ,మూడవత్ వెంకటేష్,కొదిజుట్టు శ్యాం, చిప్పకుర్తి శ్రీవివాస్, మారం సతీష్,చొప్పదండి మనోహర్,పిల్లి నవీన్, బిరుదుల వెంకటేష్,దాసరి అర్జయ్య,అధ్యక్షుడు మేకల దిలీప్,ఉపాధ్యక్షులు కొల్లూరి వేణు,జనరల్ సెక్రెటరీ బెక్కం జై కృష్ణ,కోశాధికారి బిరుదుల రవి,బెక్కెం వెంకటేష్, సతీష్, జగన్, సృజన్,అరుణ్, అరుణ్,బాబు,ప్రసన్న,బాబు,హరీష్,బన్నీ తదితరులు పాల్గొన్నారు