ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11 : మహాత్మ జ్యోతిబాపూలే విద్యా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మహాత్మ జ్యోతిబాపూలే కళాశాల,పాఠశాల ప్రిన్సిపల్ గౌతమ్ కుమార్ రెడ్డి తెలిపారు.గురువారం పాఠశాలలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి లక్షెటిపేట దండేపల్లి మండలాల యుటిఎఫ్ నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ… ఇంగ్లీష్ వారి పరిపాలనలో బాలికలకు చదువు ఉండేది కాదని వారు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో జ్యోతిబాపూలే ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్త్రీలకు విద్యనిర్పాలనే తపనతో ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలే కు విద్య నేర్పించి ఆమె ద్వారా స్త్రీలకు అందరికీ విద్య నేర్పించిన మహనీయుడు అన్నారు.ఇంగ్లీష్ వారి కాలంలో దంపతులను ఎన్ని కష్టాలు పెట్టిన కూడా వెనక్కి తగ్గగా సేవలందించిన మహనీయుడు అన్నారు.నేటి సమాజంలో స్త్రీలు చదువుకొని అన్ని రంగాల్లో ముందున్నారంటే వారి సేవే నిదర్శనం అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించి నేడు కళాశాలలకు పాఠశాలలకు ఆయన పేరు పెట్టడం ఆయన గొప్పతనాన్ని నిదర్శనం అన్నారు.విద్యార్థులంతా చక్కగా చదువుకొని తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు.అనంతరం పలువురు విద్యార్థులు మహాత్మ జ్యోతిబాపూలే విద్యా రంగానికి చేసిన సేవలు గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట దండేపల్లి మండలాల యూటీఎఫ్ నాయకులు జీ నర్సయ్య,కె రాజమౌళి చంద్రమౌళి,బి శ్రీనివాస్ మల్లేష్, తులసిపతి,తిరుపతి,పాఠశాల ఉపాధ్యాయులు అరుణ జ్యోతి, ప్రసన్నకుమార్ పి ఈ టి కార్తీక్ విద్యార్థులు పాల్గొన్నారు.