ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 (ప్రజాబలం) ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు పేరు ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎంపీ టిక్కెట్ కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని,రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి,ఇంకో వైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ పోటీ పడ్డ విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ ముగ్గురికి ఖమ్మం ఎంపీ టిక్కెట్ ను ఇచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు తెలిసింది.అందులో భాగంగా ఇతర జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపించినప్పటికి కాంగ్రెస్ నేతలు అంగీకరించనట్లు తెలుస్తోంది.దింతో జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది రాయల నాగేశ్వరరావు ముదిగొండ మండలం,వెంకటాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాయల కుటుంబం జన్మతః సీపీఎం కు చెందినప్పటికి అటుతర్వాత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం రాయల పనిచేస్తున్నాడు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ప్రధాన అనుచరుడిగా ఉంటూనే జిల్లాలోని మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు లతో సైతం సఖ్యత కలిగిన నేత పేరుంది 2021 డిసెంబర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేసి,బిఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు తో పోటీ పడి ఓటమి పాలయ్యారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తగిన బలం లేకపోయినప్పటికీ హైకమాండ్ సూచన మేరకు పోటీ చేశారు. వీటన్నింటి నేపథ్యంలో రెండు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నందున రాయల పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇటీవల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవిని సైతం రాష్ట్ర ప్రభుత్వం రాయలకు ఇచ్చింది.దింతో పాటు రాయల నాగేశ్వరరావు కు జిల్లాలోని మిగిలిన నాయకుల ఆశీస్సులు కూడా ఉండటంతో ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.