ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం జనవరి 39:
మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. టి. రఘునాథస్వామి ఆధ్వర్యంలో, డా. శ్రీదేవి, జిల్లా ప్రోగ్రాం అధికారి (ఎయిడ్స్ & కుష్టు,ఎన్ వి బి డి సి పి) సమక్షంలో స్పర్శ కుష్ఠ రోగ అవగాహన కార్యక్రమం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ఉప్పల్ లో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం “ఇకపై, కుష్ఠ రోగ బాధితులెవరు వెనుకబడరాదు – అవగాహన పెంచుదాం, అపోహలను తొలగించుదాం” అనే థీమ్‌తో జనవరి 30, 2025 నుండి ఫిబ్రవరి 13, 2025 వరకు రెండు వారాలపాటు కొనసాగనుంది
అని తెలిపారు.
కార్యక్రమ ప్రారంభంలో
మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి , రెండు నిమిషాల మౌనం పాటించారు.
సభను ఉద్దేశించి
డా. టి. రఘునాథస్వామి మాట్లాడుతూ,
ఈ రెండు వారాల ప్రచారం ద్వారా ప్రజలకు కుష్ఠ రోగం గురించి అవగాహన పెంచడం, ముందస్తు గుర్తింపుతో చికిత్స అందించడం ద్వారా ప్రతికూల పరిణామాలను నివారించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. కుష్ఠ రోగానికి సంబంధించి ఉన్న అపోహలను తొలగించేందుకు సమాజంలో అవగాహన పెంచడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అలాగే, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా ప్రచారంలో చురుకుగా పాల్గొని ప్రజలకు కుష్ఠ రోగ లక్షణాల గురించి వివరించాలని సూచించారు. ఇందులో భాగంగా తెల్ల మచ్చల గుర్తింపుపై ప్రత్యేక నిఘా పెట్టే కార్యక్రమాన్ని కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు.
అన్ని మండల స్థాయిల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లాను కుష్ఠ రోగ విముక్త జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆయన కోరారు.
కుష్ఠ రోగాన్ని తొందరగా గుర్తించడం, చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యాలను నివారించవచ్చని తెలిపారు. గ్రేడ్-2 దివ్యాంగత కలగకుండా ముందుగానే కేసులను గుర్తించి తగిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం కుష్ఠ రోగ నిర్మూలన కోసం అవసరమైన అన్ని ఔషధాలు, వైద్య సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ప్రతి వైద్య సిబ్బంది ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
కార్యక్రమం చివరలో
డా. టి. రఘునాథస్వామి , నియమితంగా చికిత్స తీసుకుంటున్న ఒక రోగిని సన్మానించి, కుష్ఠ రోగంపై అపోహలను తొలగించే ప్రతిజ్ఞను కార్యక్రమంలో పాల్గొన్న అందరితో చేయించారు. ఈ కార్యక్రమంలో
డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ లు, హెల్త్ సూపర్వైజర్ లు
ఏఎన్ఎంలు , ఆశాలు , తదితరులు పాల్గొన్నారు.
