హైకోర్టు తీర్పుతోనే మున్సిపాలిటీకి ఎన్నికలు

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 30 :

మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాలంటే హైకోర్టు తీర్పుతోనే సాధ్యమవుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం పట్టణంలోని దీపక్ నగర్ లోని అడ్వకేట్ కస్తూరి శ్రీనాథ్ ఇంటి వద్ద మందమర్రి స్థానిక సంస్థల ఎన్నికల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో స్వాతంత్య్రం తరువాత మందమర్రికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఏరియా మ్యాప్ ను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధన మేరకు జేఏసీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పూర్తి వివరాలతో హైకోర్ట్ లో జేఏసీ పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు గుడికందుల రమేష్, కార్యదర్శి మేసినేని అరుణ్ కుమార్, న్యాయవాది శ్రీనాథ్ చారి, ఉపాధ్యక్షుడు మాయా శ్రీనివాస్, సభ్యులు రామంచ తిరుపతి, బీమ్ సేన్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking