ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 28 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని గూడ వీరారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ధరావత్ మోహన్ కుమారుని అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఖమ్మం నగరంలోని చైతన్యనగర్ లో పుచ్చకాయల వెంకటేశ్వర్లు యాదవ్ నూతన గృహవేశ వేడుకలో పాల్గొన్నారు. వైయస్ఆర్ కాలనీలో ఓ వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టువస్త్రాలను కానుకగా అందించారు. అదేవిధంగా ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కొణిజర్ల మండలం పెద్దమునగాలలో సర్పంచ్ పరికపల్లి శ్రీను తల్లి వెంకటలక్ష్మి దశదిన కర్మలో పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.