ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ రామన్నపేట కాలనీలో శ్రీ శ్రీ శ్రీ శివాలయం (శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి) ఆలయానికి సోమవారం రామన్నపేట శివాలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భూమి పూజ ను పాలేరు శాసన సభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా చేశారు. ఈసందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా గుడిని అభివృద్ధి చేసుకోవాలని, గుడికట్టంగా మిగిలిన స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టుకునే విధంగా చర్యలు చూసుకోవాలని అన్నారు. తన వంతు సహాయంగా 10 లక్షల విరాళాలు ఇస్తానని ప్రకటించారు. దేవాలయాన్ని పెద్దలందరూ సమిష్టిగా గుడి నిర్మాణం చేయాలని అన్నారు. అనంతరం రామన్నపేట కాలనీలోని ప్రజల కోరిక మేరకు పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ జెడ్పిటిసి వరప్రసాద్, డివిజన్ కార్పొరేటర్ నిరంజన్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు వైఎస్ఆర్ టిపి నాయకులు రవీందర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ,సభ్యులు సుడా డైరెక్టర్ గుడా సంజీవరెడ్డి డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.