ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 28 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో విద్యార్థునలకు షీ టీమ్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రామయ్య మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం,మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని,అలాగే పిల్లలకు సైబర్ నేరాల గురించి చిన్నపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి,ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు.వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్,ఏ ఎస్సై ఓబులమ్మ కానిస్టేబుల్స్ ఐ శ్రావన్ కుమార్, పాల్గొన్నారు.