హైదరాబాద్ ఆగష్టు ఆగస్టు 28 (); : వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారికి గుర్తింపు చాలా అవసరమనీ, వారిని సత్కరించడం మన సంస్కృతిలో భాగమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే.వీ.రమణాచారి అన్నారు. అభినందన సంస్థ ఆధ్వర్యంలో గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న పలువురు ప్రముఖులకు అభినందన కల్చరల్ ఎక్స్ లెన్సీ పురస్కార ప్రదానోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ… నేడు పురస్కారాలు అందుకున్న వారంతా తమ తమ రంగాల్లో కృషి చేసి గుర్తింపు పొందిన వారేనన్నారు. సభకు అధ్యక్షత వహించిన సాహితీ వేత్త డాక్టర్ గోపి మాట్లాడుతూ… విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ కార్యదర్శి భవానిని అభిందించారు. ఈ సభలో డాక్టర్ కే.వీ.కృష్ణకుమారి,గాయని శ్రీమణి, డాక్టర్ శోభాపేరిందేవి తదితరులు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఇ.భవాని సభకు స్వాగతం పలికారు. ముందుగా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులు పాత్రికేయుడు పాతూరి సుబ్బారావును, రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మిని, సాధన సాహితీ సంస్థ రధసారధి నర్సింహాచారిని, మానస ఆర్ట్స్ కార్యదర్శి, ప్రముఖ కవి డాక్టర్ రాఘుశ్రీని డాక్టర్ రమణాచారి ఘనంగా సత్కరించి అభినందన కల్చరల్ ఎక్స్ లెన్సీ పురస్కారాలను ప్రదానం చేశారు. ముందుగా గాయని వీ. శశికళాస్వామి పలు సినీ గీతాలను మధురంగా గానం చేశారు.