విశాఖపట్నం ఆగష్టు 28 ();నరాల వ్యాధితో బాద పడే పోతాబత్తుల ప్రసాద్ కు వెస్సో సంస్థ చేయూత నందిన్చింది.దురదృష్టవశాత్తు పోతాబత్తుల ప్రసాద్ జూన్ నెలలో జీ.బి.ఎస్. సిండ్రోమ్ అనే అతి అరుదైన నరాల వ్యాధి బారిన పడ్డారు. మూడు రోజుల్లోనే వ్యాధి వేగంగా శరీరం మొత్తం వ్యాపించడంతో, అత్యవసరంగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. బంధు మిత్రుల సహకారంతో చికిత్సకు సుమారుగా 4 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ చేతులలో చలనం లేదు. చికిత్స అనంతరం మరో మూడు నెలలకు ఫిజియోథెరపీ కి, మందులకు సహాయం చేయమని వెస్సోని ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో ప్రసాద్ కు రూ.30,500/-లు అందచేసింది. విశాఖపట్నం నివాసి పోతాబత్తుల ప్రసాద్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా వెస్సో గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ గురజాపు మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యంతో ఉపాధి కోల్పోయిన ప్రసాద్ చికిత్సకు ఆపన్నహస్తం అందించిన గౌరవ దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.