నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ సోమవారం జరిగిందిజ ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిభట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు తదితరులు పాల్గోన్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కునర్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణ లో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారం లో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్ లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానంచేశారు..అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు
పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను, హావిూలను ప్రజలు పూర్తిగా విశ్వసించారు. కాంగ్రెస్పార్టీ కి తెలంగాణ లో మంచి విజయం కల్పించారు. వారికి ధన్యవాదాలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. మంచి విజయాలు అందేలా మనం కష్టపడి పని చేయాలనిఅన్నారు.