ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని అభినందించిన టీపీసీసీ కార్యవర్గం….

హైదరబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. గతంలో మూడు పార్లమెంట్‌ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా , ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్‌ 8స్థానాలు గెలుచుకుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డిగారు, ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, హర్కర వేణుగోపాల్‌, రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌,ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఫహీం ఖురేషీ, ఈరవత్రి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking