యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో క్యాన్సర్ కు అరుదైన చికిత్స

క్యాన్సర్ స్పెషలిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్

ఖమ్మం ప్రతినిధి జూన్ 5 (ప్రజాబలం) హైదరాబాద్ హైటెక్ సిటీ లోని యశోద హాస్పిటల్ లో క్యాన్సర్ కు అరుదైన చికిత్స చేసినట్లు ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ పేర్కొన్నారు. ఖమ్మం లోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది బాబుకు చేసిన అరుదైన చికిత్స గురించి వివరించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన షేక్ అబ్దుల్ ఇషాక్ అనే ఏడాది బాబుకి కడుపు నొప్పి, బరువు పెరగకపోవడం, విరేచనం కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు పలు హాస్పిటళ్లకు తిరిగి చివరకు తమ వద్దకు వచ్చారన్నారు. బాబుకు పరీక్షలు నిర్వహించగా కడుపులో 2.5 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనితో బయాప్సి చేయగా క్యాన్సర్ అని తేలిందిన్నారు. కాంప్ర హెన్సివ్ క్యాన్సర్ కేర్ విత్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమో థెరపీ చేసి కణితి ని కరిగించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో బ్లాడర్ వాల్ తో కణితి ని రిమూవ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా యూరిన్, మోషన్ కెళ్లే నరాలను ప్రిజర్వ్ చేసి సర్జరీ చేయడంతో రోగి కొలుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో నే డిస్సార్జి చేశామన్నారు. ఇప్పుడు బాబు నార్మల్ గానే యూరిన్ కెళ్తున్నాడని ,ఇబ్బంది లేదని తెలిపారు ఎటువంటి క్యాన్సర్ కైనా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. ముందుగా నే క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ వైద్యం ద్వారా తగ్గించవచ్చని తెలిపారు. ఉన్నతమైన వైద్యం ఇప్పుడు తమ హాస్పిటల్ లో అందుతోందన్నారు ఈ సమావేశంలో రోగి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking