ఎల్.ఎఫ్.ఎల్ పోస్టులు మంజూరు చేయాలి
పండిత, పిఈటి లకు పదోన్నతులను కల్పించాలి
టి. పి.టి.ఎఫ్.జిల్లా అధ్యక్షులు బోగ రమేష్
జగిత్యాల, ఫిబ్రవరి 12: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలని, ఈ షెడ్యూల్లోనే పండితులకు, పి.ఈ.టి.లకు పదోన్నతులు కల్పించాలని టి.పి.టి.ఎఫ్. జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోగ రమేష్ కోరారు. ఆదివారం డి.ఈ. ఓ. ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పంపిన వినతిపత్రం లో రమేష్ కోరారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దీర్ఘకాలముగా పెండింగులో ఉన్న పండిత, పీఈటి పోస్టులను అప్ గ్రేడ్ చేసి ఈ షెడ్యూల్ లొనే పదోన్నతి కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల హెచ్.ఎం. (ఎల్.ఎఫ్.ఎల్) పోస్టులు మంజూరు చేసి,ఎస్ జి టి లకు పదోన్నతి కల్పించి, ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఎస్జిటి గా పనిచేస్తున్న టీచర్ డీఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైతే ఎస్జిటి సర్వీస్ కు ఎంటైటిల్ పాయింట్లు ఇవ్వాలని కోరారు. సీనియారిటీ జాబితా తయారీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా బదిలీలు, పదోన్నతులు పూర్తిచేయాలని రమేష్ కోరారు. హెచ్.ఎం. పోస్టులను ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి వందశాతం భర్తీ చేయాలని, 1:2 నిష్పత్తిలో అవకాశం తో వెబ్ ఆప్షన్ కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రదానోపాధ్యాయుల ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులకు వెబ్ ఆప్షన్ అవకాశం కల్పించాలని రమేష్ కోరారు.
వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు ఫక్రుద్దీన్ ఉన్నారు.