ఉర్సు దర్గాలో ఐమాక్స్ సెంట్రల్ లైటింగ్ దగ దగలు : వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 12:
సోమవారం నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే ఉర్సు దర్గా ఉత్సవాలలో సెంట్రల్ ఐమాక్స్ లైటింగ్ సిస్టం తగదగలు ప్రారంభం అయ్యాయి. దర్గా పీఠాధిపతులు నవీద్ బాబా, , ఉబెద్ బాబా, స్థానిక కార్పొరేటర్ మారుపళ్ళ రవి చేతుల మీదుగా ఆదివారం రాత్రి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్న మాషుకు రబ్బాని ఉర్సు దర్గా ఉత్సవాలకు అధికంగా విచ్చేసే ప్రజల సౌకర్యార్థం సెంట్రల్ ఐమాక్స్ లైటింగ్ సిస్టం ప్రారంభించడం ఆనందంగా ఉందని ఇందుకు సహకరించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు అని అన్నారు. ఉత్సవాలకు విచ్చేసే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని దర్గాను అందరూ దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పూర్ఖాన్, తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్, ఎం డి చాంద్ పాషా, దస్తగిరి, మగ్దుం, ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు
Prev Post