మండలి వైస్ ఛైర్మన్ కు నూతన విప్ లకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 12 (ప్రజాబలం) ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) వైస్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండ ప్రకాష్ కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. ఆదివారం శాసనమండలిలో ఆయన వైస్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం ఎంపీ రవిచంద్ర పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాభినందనలు చెప్పారు. అదే విధంగా మండలిలో విప్ లుగా నియమితులైన శంభీపూర్ రాజు, పాడి కౌషిక్ రెడ్డి లను కూడా ఎంపీ రవిచంద్ర అభినందించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితర ప్రముఖులు సైతం ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking