పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 3:
పారదర్శకంగా పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవిఎం, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్, వివి ప్యాడ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజక వర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ హరిప్రియ లతో కలసి జిల్లా ఎన్నికల అధికారి ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. జిల్లాలోని మేడ్చల్ మల్కాజ్గిరి, కుకుట్ పల్లి, క్కుత్బుల్లాపూర్, ఉప్పల్ ఐదు నియోజకవర్గాలలో గల 2425 పోలింగ్ కేంద్రాలకు గాను ఆన్ లైన్ ద్వారా ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 591 పోలింగ్ కేంద్రాలకు 738 కంట్రోల్ యూనిట్లు, 738 బ్యాలెట్ యూనిట్లు, 827 వివి ప్యాట్ లు కేటాయించగా, మల్కాజ్గిరి నియోజకవర్గానికి 418 పోలింగ్ కేంద్రాలకు 522 కంట్రోల్ యూనిట్ లు, 522బ్యాలెట్ యూనిట్లు, 585 వివి ప్యాట్ లను, కుకుట్ పల్లి, నియోజకవర్గం పరిధిలో 417 పోలింగ్ కేంద్రాలకు 521 కంట్రోల్ యూనిట్లు, 521 బ్యాలెట్ యూనిట్లు, 583 వివి ప్యాట్ లు, క్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో 592 పోలింగ్ కేంద్రాలకు 740 కంట్రోల్ యూనిట్లు, 740 బ్యాలెట్ యూనిట్లు, 828 వివి ప్యాట్ లు, ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో 407 పోలింగ్ కేంద్రాలకు 508కంట్రోల్ యూనిట్లు, 508 బ్యాలెట్ యూనిట్లు, 569 వివి ప్యాట్ లు, మొత్తం 3029 సియు లు, 3029 బియు లు, 3393 వివి ప్యాట్ లు కేటాయించడం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండంబజేషన్ నిర్వహించి కేటాయించడం జరిగిందన్నారు. మొదటి ర్యాండమైజేషన్ కు సంబంధించిన హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking