ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (ప్రజాబలం) చింతకాని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చింతకాని మండలంలో మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నర్సింహాపురం, చింతకాని, పాతర్లపాడు గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలలో జరిగిన వివాహాది శుభకార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టువస్త్రాలను కానుకగా అందించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట సొసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నారపోగు వెంకటేశ్వర్లు, బాబు రెడ్డి, కిలారు మనోహర్, సారిక సైదులు, గోవిందరావు, మందడపు శ్రీనివాస రావు, గోగుల శ్రీనివాస రావు, ఎస్.కె రహ్మతుల్లా తదితరులు ఉన్నారు.