హైదరాబాద్ మార్చ్ 14 : వంజరలు ఇక్యతతో ఉంటూ తమ ఐక్యతను చాటాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పిలుపు నిచారు.ఉగాది సందర్బంగా వంజరి టుడే సంపాదకులు కాలేరు రూపా సురేష్ “వంజరి టుడే “డైరీ ని ఈరోజు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.మొదటి దైరిని మహారాష్ట్ర నాసిక్ కు చెందిన శాసనమండలి సభ్యుడుకిషోర్ బికాజి ధారాడే వంజరికితొలి ప్రతిని అందజేశారు.ఈ కార్యక్రమంలోనాసిక్ జిల్లా శివసేన అధ్యక్షుడు కునాల్ నరేంద్ర దరాడే వంజరి,మహారాష్ట్ర కు చెందిన పలువురు వంజరి సంఘం ప్రతినిధులు అఖిలభారత వంజరి సేవా సంఘం జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు సాల్వేర్ కృష్ణ,తెలంగాణ వంజరి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి దాత్రిక ధర్మరాజు, మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ వెంకటేష్ , తెలంగాణ వంజరిసేవా సంఘం కార్యదర్శి ఎదగని రామకృష్ణ, లండేరి శ్రీనివాసు అధికార ప్రతినిధి వాలేరు రామకృష్ణ, నాయకులు ఏమి కే సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు