అసంఘటిత కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా 13,మార్చి 2023 ప్రజాబలం ప్రతినిధి
ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలి.
ఈ శ్రమ్ పై నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ . జిల్లాలోని వివిధ రంగాల అసంఘటిత కార్మికులను ఈ శ్రామ్ (అసంఘటిత కార్మికుల డేటా బేస్) పోర్టల్ లో నమోదు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం కాన్ఫరెన్స్ హల్ నందు జిల్లా కలెక్టర్ ఈ శ్రమ్ లో అసంఘటిత కార్మికుల నమోదు పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
అన్ని శాఖల జిల్లా అధికారులు వారి వారి రంగాలైన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు, ఉపాధి హామీ,మత్స్య, డెయిరీ, గీతకార్మికులు మరియు ఇతర వృత్తుల వారు, చేనేత మరియు జౌళి, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేయు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టి కార్మికులు,వీది వ్యాపారులు,విద్యా,ఆరోగ్య రంగాల కార్మికులు మరియు ప్రభుత్వ పథకాల అమలు వారైనా మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా మరియు అంగన్ వాడి కార్యకర్తలు మరియు ఇతర వాలెంటీర్లు మొదలగు అసంఘటిత కార్మికులను ఈ శ్ర మ్ లో నమోదు చేయించాలన్నారు.

 

అసంఘటిత కార్మికులు కామన్ సర్వీస్ సెంటర్(CSC) లో కానీ లేదా వారే స్వయంగా ఈ శ్రామ్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చుననీ చెప్పారు.
కావున ఆయా శాఖాధిపతులు వారి క్షేత్రస్థాయి అధికారులచే CSC వారిచే క్యాంపులు ఏర్పాటు చేయించి 16 నుండి 59 సం.ల వయస్సు కలిగి PF, ESI లేని వివిద రంగాల అసంఘటిత కార్మికులను ఆధార్, బ్యాంక్ అకౌంట్, నామిని మరియు పని వివరాలతో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, జిల్లా కార్మిక అధికారి రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking