లక్షెట్టిపేట తైబజార్,వారసంత వేలం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 13 : లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో 2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క కాల పరిమితి తేది : 31-03-2023 తో ముస్తున్నందున 2023-24 ఆర్థిక సంవత్సరం తైబజార్ వేలం సోమవారం రోజు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటెష్ సమక్షంలో నిర్వహించనైనది.
2022-23 ఆర్థిక సంవత్సరం తైబజార్ వేల ద్వారా లక్షెట్టిపేట దినసరి సంత రూ.3,14,000/- లక్షెట్టిపేట వారసంత రూ. 2,85,000/- ఉత్కూర్ వారసంత రూ.1,60,000/- లకు వేలం ద్వారా స్వంతం చేసుకున్నారు.ఇట్టి వేలం లో మొత్తం14 మంది పాల్గున్నారు. ఇట్టి తైబజార్ ఏప్రిల్ 1 2023 నుండి అమలులోకి వచ్చును.ఇట్టి వేలంలో కే శ్రీహరి మేనేజర్,ఎర్రం రమేష్ బిల్ కలెక్టర్ పాల్గున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking