అమ్మ పౌండేషన్ అధ్యక్షుడు చెన్నవేణి భానుప్రసాద్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 : పేదలను ఆదుకొన్నప్పుడే దాతలకు నిజమైన పుణ్యం వస్తుందని అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు భానుప్రసాద్ పేర్కొన్నారు.శనివారం పట్టణంలోని సత్యసాయి నగర్ చెందిన దివిటి నర్సవ్వకు దండేపల్లి మండలానికి చెందిన అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు నిరుపేద కుటుంబాలను గుర్తించి,వారికీ ఆసరాగా రెండు,మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా హర్షనీయమన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి వారికీ సహాయం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శులు ఆకుల నవీన,లక్ష్మణ్, కార్యదర్శులు శ్రీమన్నారాయణ,ప్రచార కార్యదర్శి గడిగొప్పుల వినోద్,అమ్మ ఫౌండేషన్ సభ్యులు రాంపల్లి రమేష్,సిద్ది సాయి, దాతలు పాల్గొన్నారు.